Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తునికాకు గిట్టుబాటు ధర కల్పించి బోనస్ ఇవ్వాలి
- బీకేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు సాగు దారులపై నిర్బంధాలు ఆపాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని లేనిపక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీకేఎమ్యూ కౌన్సిల్ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తమళ్ళ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని పేద వ్యవసాయ కార్మికుల జీవితాలు కరోనా కష్టకాలంలో అల్లాడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత గిరిజన పేదలకు మూడెకరాల భూమి, పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, 57 యేండ్లు నిండిన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు నేటికీ రాక ఎదురు చూస్తున్నారన్నారు. తునికాకు కార్మికులకు గిట్టుబాటు ధర 50 ఆకులకు కట్టకు రూ.3 వేలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న రూ.14 కోట్ల బోనస్సు డబ్బులను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా, బీకేఎమ్యు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు గార్లపాటి రామనాథం, వర్కింగ్ ప్రెసిడెంట్ యార్లగడ్డ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.