Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్
నవతెలంగాణ-భద్రాచలం
కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టాలని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సభ్యులందరూ ప్రభుత్వం నిర్ధారించిన కార్యక్రమాల్లో సమన్వయంతో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసై సౌందర్య రాజన్ అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా శాఖలు, వారి సభ్యులందరూ సమన్వయంగా ప్రభు త్వం నిర్ధారించిన కార్యక్రమంలో పాల్గొ నాలని అన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అరిక ట్టాలని, ప్రతి గ్రామం లో ప్రజలందరూ వ్యాక్సిన్ చేయించు కోవాలని, మాస్కులు ధరించాలని అన్నారు. అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు మాట్లాడుతూ... భద్రా చలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 200 పడకలతో నిర్మించారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలలోని పేద గిరిజన ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాన ఆసుపత్రి ఇదేనని తెలిపారు. ఈ ఆసుపత్రిలో కరోనా వ్యాధి నిర్ధారణ కోసం చేయు ఆర్టీపీసీఆర్ పరీక్ష సౌకర్యం లేదని తెలిపారు. ఈ పరీక్ష సౌకర్యం కోసం ప్రభుత్వ స్థాయిలో కొత్తగూడెం, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలలో కూడా అందు బాటులో లేదని పేర్కొన్నారు. సూర్యా పేటకు పరీక్ష నమూనాలు పంపుట వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. ఆర్టీపీసీఆర్ వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని భద్రాచలంలో ఏర్పాటు చేయాలని కోరారు. అదేవి ధంగా ఈ ఆసుపత్రిని జిల్లా కోవిడ్ ఆసుపత్రిగా అభి వృద్ధి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావుతో పాటు సభ్యులు వై.సూర ్యనారాయణ, జి.రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.