Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరపటి స్థూపం ఆవిష్కరణ
నవతెలంగాణ-పాల్వంచ
పేద ప్రజల ఇండ్లే పార్టీ కార్యాలయాలుగా మార్చి నిరంతరం ప్రజా సమస్యలపై రాజీలేని ఉధ్యమాలు నిర్వహించిన గొప్ప పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ బరపటి సీతరాములు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య అన్నారు. శుక్రవారం స్థానిక పాల్వంచ ఆర్డీఓ కార్యాలయంలో నూనతంగా నిర్మించిన బరపటి స్థూపాన్ని 13 వర్థంతి సందర్భంగా ప్రారంభించి ముందుగా జెండా ఆవిష్కరణను పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య చేశారు. అనంతరం బరపటి హాల్‌ను కాసాని ఐలయ్య రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. బరపటి చిత్రపటానికి రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాల వేసి నివాళులు అర్పించారు. బరపటి సతీమణి పద్మ నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పట్టణ కమిటీ సభ్యురాలు వి.వాణి అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ తనకు క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పేదల సమస్యలు ప్రధానంగా ఇండ్ల స్థలాలు తునికాకు రేట్లు, గిరిజన మద్ధతు ధర సమస్యలపై పోరాడారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు అంతా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుగులోత్ ధర్మా, అన్నవరపు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా రవికుమార్, మండల కార్యదర్శి కొండబోయిన వెంకటేశ్వర్లు, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి భూక్యా రమేశ్, పట్టణ నాయకులు గూడేపూరి రాజు, మెరుగు ముత్తయ్య, కె సత్య, ఎస్కె నిరంజన్, సీనియర్ నాయకులు సిహెచ్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.