Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూముల్లో ఫారెస్టు అధికారుల పహారా
- భూముల వద్ద దీక్ష చేపడుతున్న పోడుసాగుదారులు
- మనస్థాపంతో పురుగుల మందు తాగిన మహిళ
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని తుమ్మలచెరువు పంచాయతీ పరిధిలో పోడు భూముల వివాదం రోజురోజుకు తారా స్థాయికి చేరుతోంది. ఏండ్ల తరబడి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను లాక్కునేందుకు ఫారెస్టు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ఆ పంచాయతీలోని గిరిజనులు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. 20 ఏండ్ల నుండి తాము సాగుచేసు కుంటున్న భూములను ససేమీరా వారు వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో గత ఆరు రోజులుగా పోడుభూ ము ల వద్ద టెంట్లు వేసుకుని దీక్షలు చేపడుతున్నారు. అయి తే వీరి దీక్షలను భగంచేసి భూములలో ట్రంచ్లు కొట్టేం దుకు శుక్రవారం అటవీ అధికారులు, పోలీసులు అధిక సం ఖ్యలో సిబ్బందితో హాజరయ్యారు. వీరిని అడ్డుకునేందుకు గిరిజ నులు సైతం పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. పురుగుల మందు డబ్బాలను చేతిలో పట్టుకుని తమ భూముల జోలి కొస్తే పురుగుల మందు తాగుతామన్నారు. అయినప్పటికీ పోలీ సులు కొంతమందిని నిర్భందించి స్టేషన్కు తరలించారు.
పురుగుల మందు తాగిన మహిళ ఆసుపత్రికి తరలింపు..
పోడుభూముల్లో జేసీబీ యంత్రాలను పెట్టి పనులు చేసేందుకు వచ్చిన ఫారెస్టు అధికారులతో జరిగిన వాగ్వాదంలో సాయిబుల గుంపుకు చెందిన గుండి లక్ష్మి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
30 మంది పోడు సాగుదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఫారెస్టు అధికారులను అడ్డుకుని ఆందోళన చేస్తున్న 30 మందిని అశ్వాపురం సీఐ సట్ల రాజు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకే వారిని అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు.
ఇది దుర్మార్గపు చర్య : కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదే కేశరెడ్డి
ఇరవై ఏండ్లుగా పోడు భూములను సాగుచేసు కుంటున్నవారిని ఉన్న పళంగా భూములను ఖాళీ చేసి వెళ్ళమనడం ముమ్మాటికి దుర్మార్గపు చర్య. దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గిరిజనులు వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.