Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
కర్ణాటక రాష్ట్రం భీదర్ నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు క్రమంగా తరలిస్తున్న సుమారు 17.50 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్ల బొలెరో వాహనాన్ని శుక్రవారం తెల్లవారు జామున వైరా బస్టాండ్ సమీపంలో పట్టు కున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కోతుల గోకవరం గ్రామానికి చెందిన దాసరి కిషోర్ ఎ పి 39 టి ఎం 3141 నెంబర్ గల బొలెరో వాహనం లో మిర్రేజ్ కంపెనీ కి చెందిన గుత్కాప్యాకెట్లు 165 బాక్స్ లలో తీసుకువచ్చాడు. వైరా లో ఆగి ఉన్న వాహనాన్ని అనుమానించిన హెడ్ కానిస్టేబుల్ సూరయ్య లారీ డ్రైవర్ని ప్రశ్నించటం తో విషయం బయట పడింది.ఈ విషయాన్ని వైరా ఏ సి పి కే సత్యనారాయణ,సి ఐ జే వసంత్ కుమార్,ఎస్ ఐ సురేష్ కు సమాచారం అందించగా వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.