Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
మండలంలోని మద్దులపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు ఆరు లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లను ఖమ్మం రూరల్, టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం సీజ్ చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మద్దులపల్లి పంచాయతీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ కు చెందిన నాగరాజు, విజరు, కోదాడకు చెందిన వంశీ, సూర్యాపేటకు చెందిన సతీష్ లు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి గుట్కా ప్యాకెట్లు తీసుకొచ్చి మద్దులపల్లి లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మద్దులపల్లి లోని ఓ ఇంటిపై దాడులు చేయగా ఆరు లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి బాధ్యులైన నాగరాజు, విజరు, వంశీ, సతీష్ లపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ బాణాల రాము తెలిపారు.