Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ
నవతెలంగాణ-బోనకల్
ప్రజలకు ఉపాధి కల్పించవలసిన పాలకులే ఉపాధి లేకుండా చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ విమర్శించారు. మండల పరిధిలోని గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం కొండ నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం ముష్టికుంట్లలో జరిగింది. ఈ సమావేశంలో మెరుగు సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు వత్సవాయి జానకి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులు తగ్గిస్తూ ప్రజలకు ఉపాధి లేకుండా చేస్తుందని నేడు కేంద్ర ప్రభుత్వం గతంలో 90 వేల కోట్లు నుంచి నేడు 72 వేల కోట్లకు తగ్గించడాని తప్పుపట్టారు. నేడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులు పెంచకుండా కూలీలకు కూలి బీమా కూలి బంధు పథకాలు లేకుండా బ్రతుకు దెరువు లేదని అన్నారు. ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 200 రోజులు పని కల్పించాలని రోజుకు రూ.600లు వేతనం ఇవ్వాలని రేషన్ షాపుల్లో 17 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం మండల కార్యదర్శి బంధం శ్రీనివాస రావు, నాయకులు దూబ భద్రాచలం సుగంధం వెంకటనారాయణ, అక్కినపల్లి శేషగిరి, కర్లకుంట శాంతయ్య, నోముల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.