Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరెగూడెం గ్రామ సర్పంచి దొనకొండ రామకృష్ణ
నవతెలంగాణ నేలకొండపల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఆరెగూడెం గ్రామ సర్పంచ్ దొనకొండ రామకృష్ణ తెలిపారు. శనివారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలలో మొదటి రకం ధాన్యానికి క్వింటాకు 1888 రూపాయలు రెండవ రకం ధాన్యానికి 1868 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వడ్డే యుగంధర్, రైతు కన్వీనర్ గోరంట్ల కృష్ణయ్య, ఏపీఎం అశోక్ రాణి, గ్రామ దీపిక లక్ష్మి, సుజాత, రైతులు కోలేటి అశోక్, సైదులు, రాజు, వడ్డె జగన్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఎర్రుపాలెం : మండల పరిధిలోని రాజుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని వెంకటాపురం, నరసింహాపురం గ్రామాలలో శనివారం సొసైటీ అధ్యక్షుడు వెన్నపూస కృష్ణారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బొగ్గుల లక్ష్మి, బూసుపల్లి వెంకటరెడ్డి, మెరుగుమళ్ళ లక్ష్మి, ఎంపీటీసీలు దోమందుల సామెలు, శీలం జయలక్ష్మి, ఏఈఓ లు విష్ణు, సుష్మ, సీఈఓ బొగ్గుల శివారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు బొగ్గుల గోవర్ధన రెడ్డి, బొగ్గుల శ్రీనివాస రెడ్డి, కర్నాటి రామకోటారెడ్డి, సుధాకర్ రెడ్డి, కోగంటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.