Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులపై దాడికి పాల్పడిన సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్. భాస్కర్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియా అసుపత్రిలో జరిగిన సంఘటనపై డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో నల్ల బ్యాడ్జిలు ధరించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో డాక్టర్ ప్రసాద్, డాక్టర్ బావ్సింగ్, డాక్టర్ సుజాత, హెచ్-1 యూనియన్ జిల్లా అధ్యక్షులు రాంప్రసాద్, కార్యాలయం సిబ్బంది.
ఏరియా అసుపత్రి వద్ద ఆందోళన
కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం ఏరియా ఆసుపత్రిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ సరళ, డాక్టర్స్ చేతన్, పోగ్రం ఆఫీసర్ డాక్టర్ సుజాత, డాక్టర్ సురేందర్, డాక్టర్ వెంకన్న, డాక్టర్ బాబురావు, డాక్టర్ శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : జిల్లా ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిపై రోగుల బంధువులు దాడి చేయడాన్ని ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ఇన్చార్జి డాక్టర్ వరుణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా శనివారం ఇల్లందు వైద్యశాల ఎదుట వైద్యులు, నర్సు లు, సిబ్బందితో కలిసి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా మాట్లాడారు. కోవిడ్ 19 వైరస్ ప్రమాదకరంగా విజృంభిస్తున్నప్పటికీ ప్రాణాలకు తెగించి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. కొన్ని సందర్భాలలో దురదృష్టకర సంఘటనలు జరిగితే తమ మీద నిందలు వేయటం సరికాదన్నారు. ప్రభుత్వం కూడా రోగుల బంధువులు చేసే దాడులను తీవ్రంగా పరిగణించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అన్నపురెడ్డిపల్లి : కొత్తగూడెం హాస్పిటల్లో వైద్యులు, సిబ్బందిపై దాడి చేయడం సమంజసం కాదని యర్రగుంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు సుశీల ప్రేమలత, రాష్ట్ర బాధ్యులు వెంకటేశ్వరరావు, పూలమ్మ, కోటేశ్వరరావు, కిరణ్, లక్ష్మీ, సుహాసిని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.