Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
క్యూఆర్ కోడ్ ద్వారా మహిళలకు మరింత నాణ్యమైన, సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తెలిపారు. శనివారం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ సంబంధిం చిన స్టికర్లను షీటీమ్ ఆధ్వర్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తున్న పోలీస్ శాఖ, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా భద్రతా విభాగం అందుబాటులోకి తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ తీసుకువచ్చారని, మహిళలు వేధింపులకు గురైనా, సైబర్ నేరాల బారిన పడినా పోలీస్ స్టేషన్‌కు రాకుండా ఉన్నచోటు నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసుకునే ఆవకాశాన్ని సద్వినియోగం చేదుకొవాలని సూచించారు. క్యూఆర్ లింకును సెల్ ఫోన్ లో భద్రపర్చుకుని అవసరమైనప్పుడు ఆ లింక్‌ను తెరవగానే క్యూఆర్ కోడ్ వస్తుందని, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు వస్తాయని తెలిపారు. దరఖాస్తును పూర్తిగా నింపిన అప్లై చేయగానే సంబంధిత షీ టీమ్ పోలీసులకు వెళ్తుందని తెలిపారు. పోలీసు అధికారులు స్పందించి వెంటనే దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫిర్యాదులన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కనిపిస్తుంటా యని, అందుకు సంబంధించిన పురోగతిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చే అవకాశం ఉంటుందన్నారు. ఫిర్యాదుదారులు సైతం పోలీసు సేవల పట్ల తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా మహిళలకు మరింత నాణ్యమైన, సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ స్టికర్లను కమిషనర్ కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాలలో అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని షీ టిమ్ ఇంచార్జ్ సిఐ అంజలి సూచించారు.