Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
మహిళల రక్షణ కోసం షీటీమ్‌లు నిరంతరం పని చేస్తున్నాయని, బాధిత మహిళలు ఆన్లైన్లో ఫిర్యాదులు చేయడానికి క్యూఆర్ కోడ్ పద్ధతిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా భద్రతా విభాగం షీటీమ్ సీఐ అంజలి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతా విభాగం రూపొందించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఖమ్మం నూతన బస్ స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలోమన్ రాజ్ తో కలిసి సీఐ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఖమ్మం డిపో మేనేజర్ డి. శంకర్రావు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) టి.స్వామి, బస్ స్టేషన్ మేనేజర్ రఘుబాబు, ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ రామకోటయ్య, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ యం.సాంబయ్య, సెక్యూరిటీ కానిస్టేబుల్స్ ఉషా, అస్లాం భయ్యా మరియు ఆర్టీసీ భద్రతా సిబ్బంది,కంట్రోలర్ ఐతగాని వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.