Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరంపూడి ప్రసాదరావు, ప్రభాకరరావులకు పితృ వియోగం కలిగింది. శనివారం వారి తండ్రి మోరంపూడి చంద్రయ్య (74) తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రయ్య మరణవార్త తెలిసిన సాÊథనిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్దారం వెళ్లి భౌతికకాయాన్ని సందరిÊశంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గాదె సత్యనారాయణ, చల్లగుళ్ల నరసింహారావు, సాధు జానికిరామ్, గ్రామ సర్పంచ్ నల్లంటి ఉదయలక్ష్మి, ఉప సర్పంచ్ కంచర్ల రమేశ్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.