Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ప్రభుత్వ వైద్యశాలలో శనివారం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం.సురేందర్ వ్యాక్సిన్ వేయించు కున్నారు. విధుల్లో భాగంగా ఇటీవల భద్రాది కొ¸¸త్తగూడెం కలెక్టరును ఆయన కలిశారు. కలెక్టర్‌కు పాజిటివ్ రావడంతో ఇటీవల తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం ఇల్లందులో కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. నెగెటీవ్ రిపోర్టు వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం పట్టణంలోని బీసీ కాలేజ్ బార్సు హాస్టల్‌ను, బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ కాలేజ్ బార్సు హాస్టల్ వార్డెన్ కె.నరేష్ కుమార్ పాల్గొన్నారు.