Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజినల్ కమిటీ కార్యదర్శి బండారి
నవతెలంగాణ-గుండాల
రాయల చంద్రశేఖర్‌కు ఆర్సీ నిర్మాణంతో ఎలాంటి సంబంధం లేదని, తన నిర్మాణ విచ్ఛిన్నకర చర్యలను తిప్పికొట్టాలని నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజినల్ కమిటీ కార్యదర్శి బండారి ఐలయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజినల్ కమిటీ కింద ఉన్న ప్రాంతాలలో కింద నుండిపై వరకు రాయల చంద్రశేఖర్‌కు ఎలాంటి సంబంధం లేదని, నిర్మాణంతో సంబంధం లేని ఆయన మండల కేంద్రంలో తునికాకు కాంట్రాక్టర్స్‌తో శుక్రవారం జరిగిన అఖిలపక్ష స్థాయి చర్చలో పాల్గొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నిర్మాణాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇతని చర్యలు ఉన్నాయని భావించిందన్నారు. రాయల చంద్రశేఖర్ రీజినల్ కమిటీ ప్రాంత ఉద్యమంలో ఎలాంటి జోక్యానికి పూనుకున్న పార్టీ సభ్యులు, పార్టీ శ్రేణులు తిరస్కరించి తిప్పికొట్టాలని కోరారు. దీనిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు అన్ని పక్షాలు గ్రహించాలని పిలుపునిచ్చారు.