Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడులతో సమస్యలు పరిష్కారం కావు ఎమ్మెల్యే వీరయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
పోడు సాగుదారులు అటవీ అధికారులతో సమన్వయం పాటిం చడం ద్వారానే సమస్యలు పరిష్కరించ బడతాయని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. చింతగుప్ప గ్రామానికి చెందిన గిరిజన మహిళా పోడు రైతులు ఇటీవల అటవీ సిబ్బందిపై దాడి చేయడాన్ని ఆయన సున్నితంగా ఖండించారు. శనివారం ఆయన పోడు వివాదం చోటు చేసుకుంటున్న చింత గుప్ప, పైడి గూడెం మారు మూల గిరిజన గ్రామాల్లో ద్విచక్రవాహనం ద్వారా వెళ్లి పోడు సాగుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోడు సాగుదారులు వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో తాను ఫారెస్టు, రెవెన్యూ అధికారులతో కలసి గ్రామాల్లోకి వచ్చి పోడు సాగుదారుల సమక్షంలో పోడు వివాదాలపై చర్చించి సమస్యను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటానన్నారు. భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లపు దుర్గా ప్రసాద్, మండల అద్యక్షుడు లంకా శ్రీని వాసరావు, చర్ల మండల ఎంపీపీ, జెడ్పీటీసీ గీద కోదండరామయ్య, ఇర్పా శాంత, చింతగుప్ప సర్పంచ్ కట్టం క్రిష్ణ, నాయకులు దర్శి సాంబశివరావు, పిలకా వెంకటరమణారెడ్డి, కంగాల పుల్లమ్మ, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.