Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ పట్టణంలోని భజనమందిర్ రోడ్డులో నివాసముంటూ అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ బోడేపూడి రమేశ్‌బాబు (పెద్దబ్బాయి) పార్ధివ దేహాన్ని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు శనివారం సందర్శించి, నివాళులర్పించారు. అంతక ముందు రమేశ్‌బాబు స్వగృహానికి వెళ్లి, అనారోగ్యానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి, తెలుసుకుని, వారిని ఓదార్చి మానసిక ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిరిపూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, వనమా రాఘవేందర్రావు, పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు వడ్లమూడి పూర్ణచందర్రావు తదితరులు పాల్గొన్నారు.
మాలంపాటి మాతృమూర్తికి ఎంపీ నామా నివాళి
పాల్వంచ పట్టణానికి చెందిన మాలంపాటి సూర్యనారాయణ మాతృమూర్తి ఇటీవల చనిపోయారు. ఎంపీ నామా నాగేశ్వరరావు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్ధానిక పార్టీ నాయకులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.