Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని కొత్త మల్లేపల్లి గ్రామానికి చెందిన డేగల యేసురాజు, బంటి అనారోగ్యంతో మృతి చెంద డంతో వారి కుటుం బాలను జనసేనా నాయకు లు కర్నె రవి సందర్శించి పరామ ర్శించారు. ఈ సందర్భంగా శనివారం మృతుల కుటుంబాలకు బియ్యాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... వీరిద్దరి మరణం పూర్తిగా అధికారులు, ప్రభుత్వ తప్పిదమే అన్నారు. మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో వైద్యులను నియమించకపోవడం వల్లనే ప్రజలు అనారోగ్యపాలై చికిత్స కోసం సూదర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు.
దీంతో వైద్యం సరైన సమయానికి అందక మధ్యలోనే బాధితులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకువేళ్తామని వారు తెలిపారు.