Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ఎవరి పక్షనా నిలబడతారో తేల్చిచెప్పాలి
- ఆదివాసీ సంఘాల జేఏసీ నాయకుడు రామకృష్ణ దొర
నవతెలంగాణ-అశ్వాపురం
ఆదివాసీలకు పోడు భూములు దక్కేవరకూ పోరాటం ఆగదని ఆదివాసీ సంఘాల జేఏసీ జిల్లా కన్వినర్ వాసం రామకృష్ణదొర అన్నారు. శనివారం మండల కేంద్రంలో పోడు భూముల బాధితులతో కలసి గిరిజన సంఘాలు, పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తానని గంటాపథంగా చెప్పడం జరిగిందన్నారు. ఇప్పుడు పట్టాలు ఇవ్వకపోగా వారిని భూములనుండి గెంటివేసే పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసీల భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పాడన్నారు. అయితే ఇప్పుడు ఆయన రెండు నాలుకల దోరనిణీ ఎందుకు ప్రదర్శిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే అధికార పక్షం వైపా, ఆదివాసీల పక్షన ఉన్నాడ అన్న విషయాన్ని తేల్చిచెప్పాలన్నారు.
తుమ్మలచెరువు పంచాయతీలో మొత్తం 300 వందల కుటుంబాలకు చెందిన ఆదివా సీలు 700 హెక్టార్ల భూములను కొన్ని దశాబ్దాలుగా చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటు న్నారన్నారు. ఆ భూములకు కూడా కృష్ణసాగర్ రెవెన్యూలోని సర్వేనె ంబర్ 10/1లోని భూముల న్నారు. అటువంటి భూ ములను ఫారెస్టు అధికారులు ఎలా తీసుకునేందుకు ప్రయత్నిస్తార న్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా నాయ కులు వాసం అంజిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదే కేశవ రడ్డి, ఓరుగంటి బిక్ష్మయ్య తుడుందెబ్బ నాయకులు తంగెళ్ళ భద్రయ్య, వెంకటేశ్వర్లు, రమేష్, బుజంగరావు, ప్రవీణ్ పాల్గొన్నారు.