Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు గోప్యంగా ఉంచుతాం
నవతెలంగాణ-పినపాక
మావోయిస్టుల సమాచారం ఇస్తే రూ.5 లక్షల బహుమతి ఇస్తామని ఈ బయ్యారం పోలీస్ శాఖ ప్రకటన చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నాయకులు ఆచూకీ ఇస్తే బహుమతులను ఇస్తామని, ఏడుళ్ల బయ్యారం సీఐ దోమల రమేష్, ఎస్సై టి.వి.ఆర్.సూరి గోడ పత్రికల ద్వారా శనివారం ప్రచారం నిర్వహించారు. మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుల ఫోటోలతో కూడిన వాల్ పోస్టర్లను రూపొందించి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు తారసపడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించే విధంగా ప్రజలు తెలియజేయాలని వారు తెలిపారు.