Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో డైరెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ను అరికట్టే చర్యలపై కోల్ బెల్ట్ వ్యాప్త జనరల్ మేనేజర్లతో రామగుండం నుండి సింగరేణి డైరెక్టర్ (పా) ఎస్.చంద్రశేఖర్ వీడియో కాన్ఫెరిన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల వారీగా జనరల్ మేనేజర్లకు వివిధ సమస్యలపై సూచనలు చేశారు. సింగరేణి ఆసుపత్రిలలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయడం, ధర్మల్ టెంపరేచర్ రికార్డు చేసే పరికరాల ఏర్పాటుచేయాలని చెప్పారు. అన్ని ఏరియాల హాస్పిటల్లకు రాపిడ్ టెస్ట్ కిట్లను, ఇంజెక్షన్లు, విలువైన ట్యాబ్లెట్లను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు, కార్పొరేట్ కార్యలయం నుండి జీఎం పర్సనల్ ఐఆర్ అందెల ఆనందరావు, సింగరేణి ఛీప్ మెడికల్ ఆఫీసర్ మంతా శ్రీనివాస రావు, ఏజీఎం పర్సనల్ హనుమంత రావు, ఏసీఎంఓ డాక్టర్ సుజాత, డీజీఎం పర్సనల్ కవితా నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.