Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- శుచి, రుచికరమైన వంటలు అందించడమే మా లక్ష్యం : నిర్వహకులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని ములకపాడు గ్రామ సమీపంలోని భద్రాచలం, చర్ల ప్రధాన రహదారి దుమ్ముగూడెం వైద్యశాల ఎదురుగా నూతనంగా నిర్మించిన 'ఫ్యామిలీ ఫ్రెండ్స్' దాబా హోటల్‌ను నేడు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు, వివిధ రాజకీయపార్టీల సమక్షంలో ఉదయం 10.30 గంటలకు రెస్టారెంట్ దాబా హోటల్‌ను ప్రారంభించ నున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రం నుండి పర్ణశాల దివ్యక్షేత్రానికి వెళ్లే దారి మార్గ మద్యలో నిర్మించిన ఫ్యామిటీ ఫ్రెండ్స్ దాబా హోటల్ యాత్రికులకు, పర్యాటకులకు ఎంతగానో ఉపయోకరంగా ఉండ నుందనే చెప్పవచ్చు. కుటుంబ సమేతంగా శుచి, రుచి కరమైన వంటకాలు తినేందుకు ప్రత్యేక ఏసీ గదులను నిర్వహకులు ఏర్పాటు చేశారు. ఆహ్లాద కమైన వాతావరంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్, దాబా హోటల్లో అనుభవం ఉన్న వంట మాష్టార్లచే కోవిడ్-19 నిబందనలు పాటిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. భోజన ప్రియులకు నచ్చే విధంగా సరసమైన రేట్లతో చికెన్ భిర్యాని, చికెన్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఐటమ్స్, మంచూరియా, రోటీ, పుల్కా వంటి రుచికమైన వంటలను రెస్టారెంట్ దాబా హౌటల్లో అందించ నున్నారు. ఇద్దరు స్నేహితులు కలిసి ఎంతో శ్రమకోర్చి ఈ ప్రాంత ప్రజలకు, పక్కనే ఉన్న ఛత్తీష్‌ఘడ్ వాసులకు, పర్ణశాలకు వచ్చే పర్యాకులకు శుభ్రతతో కూడిన వంటకాలు అందించాలనే లక్ష్యంతో రెసా ్టరెంట్ దాబా హౌటల్‌ను ప్రారంభిస్తున్న నిర్వ హకు లు పత్తివాడ జగదీష్, ముళ్లపూడి హరిచంద్ర ప్రసా ద్లు నవతెలంగాణకు తెలిపారు. మిత్రులు, శ్రేయో భిలాషులు సహకరించి మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలన్నారు.