Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి దండా జ్యోతిరెడ్డి
నవతెలంగాణ రఘునాధపాలెం
4వ డివిజన్ అభివృద్ధి కోసం పాటుపడతానని టీఆర్ఎస్ అభ్యర్థి దండా జ్యోతి రెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని పాండురంగ పురంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మంత్రి పువ్వాడ అజరు కుమార్ సహాయ సహకారాలతో డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంటి కొమ్ము శ్రీనివాసరెడ్డి, కంచర్ల దయాకర్, జోగిపర్తి ప్రభాకర్, ఎడవల్లి బిక్షం, కోడిరెక్కల ఫ్రాన్సిస్, నార్ల వెంకన్న, సుబ్బాచారి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.