Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-గాంధీ చౌక్
30వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ, సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరవపల్లి స్వాతి ప్రచారం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ డివిజన్లో ఉన్న సమస్యలపై తాను పోరాడుతానని, డివిజన్లో అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఓటును హస్తం గుర్తుకే వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతేకాకుండా గతేడాది కరోనా సమయంలో గర్భిణీలకు స్వాతి ప్రత్యేకంగా గుడ్లు, పాలు పంచిపెట్టడం కూరగాయలు ప్రతి ఇంటికి రెండు నెలలు పంచి పెట్టడం జరిగింది. అంతేకాకుండా క్రిస్టమస్కి పేద క్రిస్టియన్స్కి చీరలు పంచిపెట్టడం, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు చికెన్ పంచిపెట్టడం మరెన్నో కార్యక్రమాలు ఈ డివిజన్లో స్వాతి చేపట్టారు. కార్యక్రమంలో అరవపల్లి క్రాంతికుమార్, బి రెడ్డి ప్రకాష్, బాసాని వెంకన్న, బాసాని నరేష్, జల్లల నవీన్, బాసాని అజరు పాల్గొన్నారు.