Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-ఇల్లందు
మధ్యాహ్న భోజన కార్మికులకు కరోనా భృతి కింద నెలకు రూ.5వేలు, 50 కేజీల బియ్యం ఇవ్వాలని స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట శుక్రవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఈఓ పిల్లి శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్హెచ్ సుల్తాన, సీఐటీయూ జిల్లా నాయకులు తాళ్లూరి కృష్ణలు పాల్గొని మాట్లాడుతూ... గత 14 నెలలుగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కరోనా నేపథ్యంలో పాఠశాలలలో వంట లేక, జీతాలు ప్రభుత్వం ఇవ్వక పోవడం వల్ల పస్తులుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, కనకమ్మ, ఉమా, హుస్సేన్ బీ.జయమ్మ, యాదమ్మ, సరిత, లచ్చమ్మ, మీరా, తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : కరోనా వలన మధ్యాహ్న భోజన కార్మికులు జీవితాలు రోడ్డున పడ్డాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ అన్నారు. స్థానిక ఎండీఓ రెవతికి శుక్రవారం వినతిపత్రం ఇచ్చి, కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులతో కలసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన పీఆర్సీ వీరికి కూడా వర్తించేటట్టు ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జంగిలి వెంకటరత్నం, వెంకటరమణ, మునెమ్మ, రాములమ్మ, పుష్పవతి, సుగుణ, మల్లేశ్వరి, కృపమ్మ తదితరులు పాల్గొన్నారు.