Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షతగాత్రులను 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
నవతెలంగాణ-చర్ల
మండల పరిధిలోని కేశవపురం గ్రామపంచాయతీ రాళ్ళగూడెం గ్రామ శివారు మూలమలుపు వద్ద ఆటో, బస్సు ఢకొీనడంతో ఇద్దరు యువకులు తీవ్రరంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులకు కాళ్ళు విరిగాయి. క్షత గాత్రులను హుటాహుటీన చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రత్యక్షంగా చూచిన వారు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నాయకుల కాలనీకి చెందిన ఐతం సాయి ఆటో డ్రైవర్గా గత కొంత కాలంగా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాడని తన స్వగ్రామమైన నాయకుల కాలనీలోగల తల్లిదండ్రుల దగ్గరకు టీఎస్04యూఏ9029 నెంబర్ గల ఆటోలో చర్ల వస్తుండగా రాళ్లగూడెం మూలమలుపు వద్ద చర్ల నుండి భద్రాచలం వైపు వెళ్తున్న టీఎస్04యూఏ596 నెంబరుగల ఆర్టీసీ బస్సు ఆటో ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దర యువకులకు కాళ్లు విరిగాయి. వీరిని వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.