Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది వరకు పల్లెలంటే...పచ్చని ప్రకృతి అందాలు కలబోసి, పల్లెలంటే...ప్రశాంతమైన వాతావరణం మేళవించి, పల్లెలంటే... ఎలాంటి కల్లాకపటం ఎరుగని సాధారణ జీవితాలను గడిపే ప్రజలతో కూడిన ఏజెన్సీ పల్లెలు. ఒక్కమాటలో చెప్పాలంటే పల్లెలు పట్టణాలకు పట్టుకొమ్మలంటారు. కానీ ఈ పల్లెలకు ఏమైంది..? పల్లె ప్రజలకు ఏమైంది..? అంటే కనిపించని కరోనా మహమ్మారి ఆవహించింది అని చెప్పక తప్పదు.
- అవగాహన లోపమా, నిర్లక్ష్యమా..?
నవతెలంగాణ-గుండాల
పట్టణాలకు పట్టుకొమ్మలు పల్లెలే అన్నట్లుగా ఆ పట్టణాల నుండి కరోనా పల్లెలకు చాపకింద నీరులా పాకింది. ఎక్కడినుండి వచ్చిందో..! కానీ ఈ కరోనా రక్కసి యావత్ ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అభం శుభం తెలియని పసికందు నుండి మొదలుకొని చేతికర్రను ఆసరాగా చేసుకుని చేదతీరుతున్న వృద్ధులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చిన్నా పెద్దా, బీద, పేద అనే తారతవ ు్యం లేకుండా చిన్నాభిన్నం చేసింది. కారణం పెండ్లీలు, ఫంక్షన్ల పేరుతో గుంపులు గుంపులు గా గుమిగూడమేనా..? జాగ్రత్తలు పాటించకుండా అజాగ్రత్తగా ఉండడమేనా..? మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు రక్షణ చర్యలను పాటించకపోవడమేనా..? అంటే అవుననే చెప్పొచ్చు.
ఎందుకంటే గత ఏడాది కరోనా భయంతో పెండ్లీలు, ఫంక్షన్లను వాయిదా వేసుకున్న ప్రజలు కరోనాను కామన్‌గా తీసుకుని ఈ ఏడాది వరస పెండ్లీలు, ఫంక్షన్లు చేయడం వాటికి ఎక్కడెక్కడినుండో జనాలు కోకొల్లలుగా రావడం కరోనా నిబంధనలు పక్కన పెట్టి కబుర్లు, ఎంజాయిలతో కాలయాపన చేయడం కూడా కావచ్చు. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పదుల సంఖ్యలో పెరిగిపోతున్నాయి.
మాస్కులు, శానిటైజర్ల వినియోగం అసలు ఉందా..?
కరోనా నుండి కాపాడుకునేందుకు మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం తప్పనిసరి అని అధికారులు ఒకవైపు చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. మాస్కులు, శానిటైజర్లు వెంట పెట్టుకున్నప్పటికీ కేవలం అధికారులు ముందు మాత్రమే పాటించడం ఆ తర్వాత తీసి జేబులో పెట్టుకో వడం తప్పితే పూర్తి స్థాయిలో పాటించడం లేదు. పెండ్లీలు, ఫంక్షన్ల దగ్గర భౌతిక దూరం కూడా పాటిం చకపోగా కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. తమ తమ పేస్ లు చూసి అవతలి వారు గుర్తుప ట్టాలనో.. ఏమో కానీ కోవిడ్-19 నిబంధనలు మాత్రం ఒక్కరూ పాటించడం లేదని చెప్పుకుంటున్నారు.
పల్లెల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతుందా...?
కరోనా కట్టడిలో భాగంగా ఏప్రిల్ 21 నుండి 30 వరకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే!. కానీ అది పల్లెల్లో అమలవుతుందా..? అంటే లేదనే అంటున్నారు. ఎందుకంటే పెండ్లీలు రాత్రి పూట మాత్రమే ఎక్కువగా జరుగుతుంటాయి. కుర్రకారు ఎక్కువగా గుమిగూడి డాన్సులు చేస్తుంటారు. ఎలాంటి ఆంక్షలు పాటించకుండా లెక్కకు మించి ప్రజలు గూమిగూడుతున్నారని అనుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరిన్ని కరోనా కేసులు నమోదయ్యో అవకాశాలు లేకపోలేదని, అందుకు అధికార యంత్రాంగం కళాజాత రూపంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలువులు కోరుతున్నారు.