Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం సహకార సంఘ పరిధిలోని నాలుగు మండలలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినట్టు కొత్తగూడెం సహకార సంఘ చైర్మన్ మండె వీరహనుమంతరావు తెలిపారు. శుక్రవారం సోసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట సుజాతనగర్ మండల తహసీల్దార్ సునీల్ కుమార్ రెడ్డి, చుంచుపల్లి తహసీల్దార్ నాగరాజు, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ నాగరాజు, ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు ఆకాల వర్షాలకు ఇబ్బంది పడకుండా తమ ధాన్యాన్ని ముందుగానే భద్రపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఏఓ నర్మద, చుంచుపల్లి ఏఓ. రాజేశ్వరి, ఆడిటర్ ఏ.నరేష్, సొసైటి సీఈఓ పి.సారయ్య, ఏఇఓ శరత్, వినిలా, రమ్యశ్రీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు చెన్నారావు, వెంకటేశ్వర్లు, అభిలాష్, సైదులు రైతులు పాల్గొన్నారు.