Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లులు కేటాయించి రైతులను ఆదుకోవాలి
మంత్రిని, జడ్పీ చైర్మన్ కలెక్టర్ని కలిసిన నాయకులు
నవతెలంగాణ-ఎర్రుపాలెం
వరి ధాన్యం పండించిన రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టి కాటాలు వేయడం కోసం ఎదురుచూస్తున్నారని త్వరితగతిన వడ్లు కాటాలు వేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజరు కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ను, కలిసి రైతు సమస్యలను వివరించినట్లు మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, మండల రైతు బంధు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శీలం వెంకటరామిరెడ్డి రైతులతో కలిసి ఖమ్మంలో వివరించినట్లు తెలిపారు. ఎర్రుపాలెం మండల ప్రజాప్రతినిధులు రైతులు వారిని కలిసి మాట్లాడినట్లు తెలిపారు. కాటాలు వేయడం కోసం ధాన్యం కల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని వర్షాలు పడి తడిచిపోయి రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున మండలానికి మిల్లులు కేటాయించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని త్వరితగతిన కాటాలు వేసి కొనుగోలు చేయాలని తెలియజేసినట్లు గా వారు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు ఎవరు అధైర్య పడవద్దని దళారులకు తక్కువ ధరలకు అమ్ముకొని మోసపోవద్దని సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటనారాయణ, పెద్ద గోపవరం ఎంపీటీసీ కిషోర్ బాబు, చిరంజీవి, తదితరులు ఉన్నారు,