Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేలకొండపల్లి
మండలంలోని ముఠాపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సానుభూతి పరుడు భాగం వెంకటయ్య(83) గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య కుమారుడు రవి ఉన్నారు. భాగం వెంకటయ్య ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన పార్టీ పట్ల అత్యంత విశ్వాసం, అంకితభావం, నిబద్ధతతో పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని సేవలు అందించారు. ఆయన భౌతిక కాయాన్ని సీపీఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, నంబూరి నారాయణ, భాగం నరసింహారావు, సిపిఎం నాయకులు ఏలూరి రంగారావు, బెల్లం లక్ష్మి, ఇంటూరి అశోక్, టిఆర్ఎస్ నాయకులు గుడిమల్ల మధు తదితరులు సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.