Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా
- జెండా ఊపి ట్యాంకర్లు పంపిన అడిషనల్ కలెక్టర్
నవతెలంగాణ-సారపాక
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణతో కరోనా రోగులు ఆక్సిజన్ దొరకక విలవిల్లలాడుతున్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వనికి, కరోనా బాధితులకు సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ సంస్థ బాసటగా నిలిచింది. ఆక్సిజన్(ఊపిరి) సరఫరాకు ముందుకొచ్చింది. ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ తరఫున గురువారం అడిషనల్ కలెక్టర్ అనుదీప్ చేతులమీదుగా ప్రభుత్వానికి 21 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్‌ను సరఫరా చేసేందుకు జెండా ఊపి ట్యాంకర్‌ను పంపారు. ఈ సందర్భంగా ఐటీసీ జనరల్ మేనేజర్ ప్రబోద్ కుమార్ పాత్రో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో సమాజానికి మద్దతు ఇవ్వడానికి ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ గత 14 నెలల్లో బహుళ క్రియాశీల సామాజిక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఈ దశలో తెలంగాణలో అవసరమైన కోవిడ్ రోగులకు మద్దతుగా ఉచిత ఆక్సిజనను సరఫరా చేయడానికి యూనిట్ తన ప్రక్రియ, నైపుణ్యం, పరిశ్రమ నెట్‌వర్క్‌ను ప్రభావితం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు 21 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో ఒక ట్యాంకరు సరఫరా చేయడం జరిగిందన్నారు. ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ నుంచి ప్రతిరోజూ 5 మెట్రిక్ టన్నుల ధృవ ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. తొలుత అడిషనల్ కలెక్టర్ అనుదీప్ ఐటీసీ కర్మాగారాన్ని సందర్శించి పలు విభాగాలను కలియతిరిగి యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడ్మిన్ మేనేజర్ చెంగల్రాలావు, ఐటీసీ పలు విభాగాల మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.