Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల సేవకు అంకితమైన వైద్యులు డాక్టర్ బంక గంటయ్య, కుంభ శారద దేవి
నవతెలంగాణ-మణుగూరు
వైద్య వృత్తిని ఎన్నుకొని సింగరేణి కార్మికులు, ప్రజల సేవకే తమ జీవితాన్ని అంకితం చేసిన ఉత్తమ వైద్యులు డాక్టర్ బంక గంటయ్య, డాక్టర్ కుంభ శారద దేవిలు. దక్షిణ భారతదేశంలో వెలుగులు నింపుతున్న సిరులతల్లి సింగరేణి నెలకొని వున్న మణుగూరు ఏరియాలోని ఆసుపత్రిలో పనిచేస్తూ పదవి విరమణ పొందుతున్న ఆదర్శ దంపతులు. గత 25 యేండ్లుగా మెడికల్ సూపర్డెంట్గా వైద్య సేవలు అందిస్తూ, సింగరేణి కార్మికులు, యూనియన్ నాయకుల నుండి ప్రశంసలు పొందారు. సునామీల విరుచుకుపడు తున్న కరోనాను ఎదుర్కొనేందుకు పని ప్రదేశాల్లో అవగాహన కల్పించడం, కరోనా బాధితులకు చికిత్స అందించడం ద్వారా వారు రియల్ వారియర్లుగా మనన్నలు పొందారు. డాక్టర్ గంటయ్య, శారదదేవి సింగరేణికి వందనం అభివందనం తెలియజేస్తూ ఆ సంస్థ ద్వారానే ఈ స్థాయికి ఎదుగామని సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు కుమారులైన రవితేజ, మధుకిరణ్లు కూడా డాక్టర్లలే. రవితేజ నిర్ధేశకత్వంలో 'రియల్ వారియర్' అనే షార్ట్ ఫిల్మ్‌ను స్థానిక సింగరేణి వైద్యులు, సిబ్బంది, తమ కుంటుబ సభ్యులచే నిర్మించారు. ఈ షార్ట్‌ఫిల్మ్ ముందు తరాల వారికి కరోనా వల్ల కలిగే ముప్పును ముందే హెచ్చరించిందని ఏరియా జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు తెలియజేశారు. పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ జీవితాన్ని పన్నంగా పెట్టారని ఈ షార్ట్‌ఫిల్మ్‌లో తెలియజేశారు. 2019లో రాష్ట్ర స్థాయిలో జరిగిన అభ్యుదయ కళ సేవా సమితి కొత్తగూడెం వారు ఉత్తమ డాక్టర్లుగా, అంతేకాకుండా 2020లో సింగరేణి సంస్థ ఉత్తమ వైద్యులుగా డాక్టర్ గంటయ్య దంపతులకు ఘనంగా ఆత్మీయ సత్కారం నిర్వహించారు. కార్మికులను, ఇతరులను అప్యా యంగా పలకరించే వీరి దాంపత్య జీవితం పలువు రికి ఆదర్శంగా నిలుస్తుందని డాక్టర్లు కొనియాడారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన వీరు సహానం, ఓర్పుతో తమ 28 యేండ్ల వైవాహిక జీవితాన్ని వైద్య సేవ చేస్తూ ఆనందంగా గడిపారు. ప్రస్తుతం సునామీల ముంచుకు వస్తున్న కరోనా సమయంలో వైద్య వృత్తికి దూరం కావడం బాధకరమైన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 61 యేండ్ల ఉద్యోగ విరమణ సింగరేణిలో అమలు చేసినట్టు అయితే కరోనా బాధితులకు వైద్యం అందిస్తూ రియాల్ వారియర్‌గా ముందు వుండే వారని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.