Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాకారులను ప్రోత్సహించేలా విశాల ప్రాంగణం
- సీఐ వెంకటేశ్వర్లు కృషి అభినందనీయం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కోట్లు వెచ్చించినా మండల కేంద్రాల్లో ఏర్పాటు కాని క్రీడా మైదానాన్ని వైద్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖతో పాటు పలు శాఖలు అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో బంతితో కోర్టులో ఆడేలా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు. మండల క్రీడాకారులను ప్రోత్సహించేలా విశాలవంతమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి భళా బంతి కోర్టులో ఆడేలా చేసిన బాస్కెట్ బాల్ మాజీ కెప్టెన్ దుమ్ముగూడెం సీఐగా విధులు నిర్వహిస్తున్న నల్లగట్ల వెంకటేశ్వర్లు కృషిని క్రీడా లోకంతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు సైతం అభినందిస్తున్నారు.
సీఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు స్వదాహాగా క్రీడా స్ఫూర్తి కలిగిన అధికారి. ఆయన బాస్కెట్ బాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కెప్టెన్‌గా భాద్యతలు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించాడు. ఏజన్సీలో ఉన్న గిరిజన యువతను క్రీడల్లో ముందుంచడానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది అనే చెప్పవచ్చు. గిరిజన యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు వాలీబాల్, క్రికెట్, షటిల్ కిట్లు వంటివి అందజేస్తూ వారిని ప్రోత్సహించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. పట్టుదలతో వైద్యశాల వెనుకు రాళ్లు, ముళ్ల కంపలతో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని వైద్యాధికారి బాలాజీనాయక్, పంచాయతీ రాజ్, రెవెన్యూశాఖల సహకారంతో పాటు మండలంలోని ప్రజా ప్రతినిధుల సహకారంతో రెండు నెలల అవిశ్రాంతంగా పోలీస్ శాఖ సహకారంతో శ్రమకోడ్చి క్రీడా మైదానాన్ని తయారు చేశారు. ఈ మైదానంలో 100 మీటర్లు 200 మీటర్లు ట్రాక్స్‌తో పాటు హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్లు ఏర్పాటు చేశారు. మండల క్రీడా కారులు ఇట్టి క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని సీఐ తెలిపారు. క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేసిన వైద్యాధికారి బాలాజీ నాయక్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ అధికారులతో పాటు ట్రాక్టర్ యజమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞ్నతలు తెలిపారు. క్రీడా మైదానం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీడీఓ ముత్యాలరావుతో పాటు వివిద శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.