Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ప్రస్తుత సమాజంలో మానవత్వం అనే మాట వినడమే అరుదు. ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకచోట అడపాదడపా కన్పిస్తుంది. కరోనా కష్టకాలంలో కనికరం అనే పదం వినిపించడం కూడా అరుదే. ఎప్పుడైతే కరోనా మహమ్మారి ఈ దేశంలో అడుగు పెట్టిందో అప్పట్నుంచి ఏ ఒక్కరికీ కంటిమీద కునుకు లేని పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది. ఏ ఒక్కరూ నీరసంగా కనబడినా, దగ్గు, జలుబు జ్వరంతో ఉన్నా వాళ్ళ దగ్గరలో నిలబడాలంటేనే భయపడే రోజులివి. అమ్మో..!కరోనా అబ్బో...!కరోనా అంటూ కిలోమీటరు మేర పరుగెత్తే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ మానవత్వం ఎక్కడో లేదు, మంచి తనం ఇంక్కెడో లేదు ఇక్కడే ఉంది అన్నట్లుగా ఒక కారోబార్ కమ్ రిపోర్టర్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని శంభునిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఒక మహిళ కరోనా టెస్ట్ కోసం మండల కేంద్రంలోని పీహెచ్సీకి వచ్చింది. టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ రావడంతో సమయానికి అంబులెన్స్ లేదు. ఉదయం 7-30 గంటల నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు వరకు అక్కడే ఉంది. గుండాల నుండి తన గ్రామానికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో కరోబార్, దిశ రిపోర్టర్ తవిడిశెట్టి నాగరాజు మానవతా దృక్పధంతో ఆమెకి ఉదయం అల్పాహారం, మద్యాహ్నం భోజనం పెట్టించి తన గ్రామానికి పీపీఈ కిట్ ధరించి తన బైక్పై ఆమెను తన గ్రామానికి డ్రాప్ చేశారు. దీంతో కారోబార్ నాగరాజుని హాస్పిటల్ సిబ్బంది పలువురు ప్రశంసించారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే అసలైన ఆనందం
దిశ రిపోర్టర్, కారోబార్ తవిడిశెట్టి నాగరాజు
ఎవ్వరైనా సరే ఆపదలో ఉన్నారంటే నాకు చేతనైన సాయం చేస్తుంటాను. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. అందుకు నాకు చేతనైన సాయం అందించడంలో ఏ మాత్రం వెనకకు తగ్గనం.