Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరక్టర్గా గుంపెళ్లగూడెం యువతి
- యధార్ధ కథాంశంతో నిర్మితం
- పల్లెటూరి నుండి సినీ దర్శకురాలిగా ఏదిగిన సుమలత
నవతెలంగాణ-కారేపల్లి
నేటి సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలపై యథార్ధకధాంశంతో డెవిల్స్ డైరి (ఏమి జరిగింది) సినిమాను తెరకెక్కించనున్నట్టు చిత్ర దర్శకురాలు పూజ సుమలత (చిట్టి) తెలిపారు. గురువారం కారేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ కారేపల్లి మండలం గుంపెళ్ళగూడెంకు చెందిన తాను పడ్డ కష్టాన్ని, సమాజం, సినీ ఇండిస్టీలో జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలపై ఎక్కుపెట్టిన చిత్రం డెవిల్స్ డైరీ అని అన్నారు. పల్లెటూరి నుండి సినీ పరిశ్రమకు వస్తుంటే అనేక సూటిపోటీ మాటలు, అవమానాలు ఎదుర్కొన్నట్లు అవే తనకు పట్టుదల కలిగేలా చేశాయన్నారు. నాన్న శేఖర్ చనిపోగా అమ్మ ప్రమీల అంతా తానే సాకిందని తాను పడ్డకష్టాలను వెలిబుచ్చారు. కూలీ పనికి వెళ్ళితనను సినిమాపరిశ్రమకు వెళ్ళటానికి ప్రోత్సహించిందని అమ్మకు జన్మజన్మలా కృతజ్ఞరాలినన్నారు.
విశ్వజాగృతి బ్యానర్ నిర్మాణ సారధ్యంలో బలరాం నిర్మాతగా డెవిల్స్ డైరీ చిత్రం రాబోతుందన్నారు. యధార్ధకధను ఆధారంగా చేసుకోని నిర్మిస్తున్న ఈ చిత్రం సహజ సిద్ద చిత్రికరణతో ఉందన్నారు. విజరురాం, చంద్రశేఖర్ హీరోలుగా శైలజా, తేజస్విని హీరోహీరోహిన్లుగా నటిస్తున్నారని తెలిపారు. చిత్రానికి సంగీతం డీ.వీ.సత్యనారాయణమూర్తి, డీవోపీ నాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు నటిగా వచ్చానని, సినిపరిశ్రమలో జరుగుతున్న దారుణాలను చూచి సొంతంగా కధ రాసుకోని డైరక్టర్గా చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్గా పని చేసిన తనకు విశ్వజాగృతి వారు చాన్స్ఇచ్చారని వారి పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా చిత్రీకరణ చేస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలిపారు. సమాజానికి ముఖ్యంగా యువతకు అవసరమైన మేసెజ్ ఇవ్వటానికి చిత్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు.