Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
- సీపీఐ (ఎం) జిల్లా నాయకులు మోరంపూడి
నవతెలంగాణ- సత్తుపల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో కాటా వేయక పోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సీపీఐ (ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల ధాన్యం కేంద్రాల్లో కొందరి రైతుల ధాన్యం అకాల వర్షానికి తడిసి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్భాటంగా ధాన్యం కేంద్రాలను ప్రారంభించారు కాని కాటాలు వేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసినా, ఇంకా ఏమైనా నష్టం జరిగినా ఆయా కొనుగోలు కేంద్రాల బాధ్యులే నష్టాన్ని భరించాల్సి ఉంటుందన్నారు. అలాగే గత రెండు రోజుల క్రితం పడిన అకాల వడగండ్ల వాన, ఈదురు గాలులకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు విధించకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పాండురంగారావు డిమాండ్ చేశారు. పంటనష్టం జరిగిన మామిడి రైతులను ఆదుకోవాలన్నారు. నష్టం జరిగిన మామిడి తోటలను పరిశీలించి ఎకరానికి రూ. 10 వేలు పరిహారం అందించి ఆదుకోవాలని పాండురంగారావు ప్రభుత్వాన్ని కోరారు.