Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి అవకాశం కల్పించండి
- 12వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి
- చిరుమామిళ్ల లక్ష్మినాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం అభివృద్ధి ప్రధాత, ప్రియతమ నాయకులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆశీస్సులతో 12వ డివిజన్ 97 శాతం అభివృద్ధితో పాటు నిత్యం మీకు అందుబాటులో ఉంటూ సేవలందించటమే ప్రథమ లక్ష్యమని 12వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిరుమామిళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. 12వ డివిజన్ నుంచి తన నా భార్య చిరుమామిళ్ళ లక్ష్మి నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. డివిజన్లో గత 24 సంవత్సరాలుగా మీ కుటుంబ సభ్యులుగా మీతో కలిసి జీవిస్తున్న మా జీవితం తెరచిన పుస్తకమని అన్నారు. 1997లో మధిర ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఇదే వార్డులో స్థిరపడ్డామని తెలిపారు. విద్యార్థి దశలో కలిగిన రాజకీయ చైతన్యం మరియు సేవా దృక్పథం ఉన్న నన్ను మీరందరూ ఎంతో ప్రేమతో గతంలో ఇండిపెండెంట్గా గెలిపించారని గుర్తు చేశారు. కేవలం 7 శాతంగా ఉన్న సిమెంట్ రోడ్లను 97శాతంగా పెంచి పూర్తిచేశానని, డివిజన్లో మట్టి రోడ్ అనేది లేకుండా చేశానని, వాటర్ ట్యాంక్ నిర్మించి నిత్యం మీలో ఒకడిగా మెలిగిన నన్ను గెలిపించాలని కోరారు. గతంలో శ్రీనగర్ 10వ లైను నుండి కలెక్టరేట్ వరకు వున్న వార్డును మరింత సులభంగా అభివృద్ధి చేసుకోవడానికి 3 వార్డులుగా విభజింప చేయటం మరచిపోలేని విజయమని, కరోనా లాక్డౌన్ సమయంలో డివిజన్ ప్రజల, మిత్రబృందం సహకారంతో ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి నిత్యం సహాయంతోపాటు, ఇంటినుండి బయటకు రాలేనివారికోసం వారి ఇళ్ళకే సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు అందించగలగటం మా పూర్వజన్మసుకృతమని తెలిపారు. ఎన్నికలప్పుడు మాత్రం ఐదేళ్ళలో ఒక్కరోజు కూడా కనిపించని అభ్యర్థులు సైతం మీ వద్దకు ఓటుకోసం వస్తారని, మన డివిజన్లో అధికశాతం విద్యాధికులు, విజ్ఞనులు, వివేచనతో స్వతంత్రంగా ఆలోచించి ఔటేయగలవారని కోరారు. మన డివిజన్, మన ఓటు, మన నిర్ణయమన్నారు.
12వ డివిజన్ మ్యానిఫెస్టో...
1. గతంలో 100 శాతం సిమెంట్ రోడ్లు ఎలా పూర్తి చేయగలిగామో రాబోవు ఐదేళ్ళలో 100 శాతం డైన్లు పూర్తిచేయడం
2. డివిజన్ మధ్యలో ఉన్న ఎన్ఎస్పీ కాలువ స్థలంలో ఖమ్మం నగరానికే తలమానికమైన మున్సిపల్ పార్కుని అభివృద్ధి చేయడం.
3. రాబోవు ఐదేళ్ళలో డివిజన్లో 3-ఫేజ్ పవర్ పూర్తి చేయడం
ప్రజలందరికి అందుబాటులో ఈ డివిజన్ మధ్యలో నివసిస్తూ, నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు.