Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లిలో వృద్దురాలిపై అత్యాచారం చేసి హత్య చేయటాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం అందోళన చేశారు. బస్టాండ్ సెంటర్లో ప్లకార్డు చేతబూని మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళా చట్టాలను కఠినంగా అమలు చేయాలని, దోషులకు వెంటనే శిక్షవిధించాలని నినదించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర మాట్లాడుతూ పాలకులు మహిళా రక్షణకు అనేక చట్టాలు చేశామని గొప్పలు పోతున్నారు తప్ప వాటి అమలులో చిత్తశుద్ది చూపటం లేదన్నారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని తప్ప ఆగటం లేదన్నారు. దోషులకు కాలయాపన లేకుండా కఠిన శిక్షల పడితే తప్ప మహిళలపై దాడులు ఆగవన్నారు. బాధితురాలు నాజీ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ముండ్ల ఏకాంబరం, అన్నారపు కృష్ణ, పీవోడబ్ల్యూ నాయకురాలు వై.జానకీ, న్యూడెమోక్రసీ నాయకులు రావుల నాగయ్య, సత్తిరెడ్డి, సక్రు, హమాలి వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) నాయకులు సారయ్య,వెంకన్న పాల్గొన్నారు.