Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేపల వ్యాపారి ముఖ్యమా ?
గ్రామ ప్రజల ప్రాణాలు ముఖ్యమా ?
సర్పంచ్ తీరుపై అనుమానాలు
నవతెలంగాణ-బోనకల్
క్రిమిసంహారక మందు చల్లి చేపలు పడుతున్న చేపల వ్యాపారి చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన మరసకట్ల సంజీవ్ రావుతో రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ కుమ్మక్కు అయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. క్రిమిసంహారక మందులు చల్లి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సంజీవ రావుపై చర్య తీసుకోకుండా అతనికి మద్దతుగా ఉండటం గ్రామంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవైపు మండల వ్యాప్తంగా కరోనా వ్యాధితో ప్రజలు అల్లాడుతుంటే సంజీవరావు మాత్రం చేపల వ్యాపారం పేరుతో చెరువు వద్ద గుంపులు గుంపులుగా జనాలను పోగు చేస్తూ ఉండటం పట్ల అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రావినూతల చెరువులో చేపలు పట్టేందుకు సంజరు రావు క్రిమిసంహారక మందులు చల్లి చేపల పడుతుండగా గ్రామస్తులు అడ్డు పడిన సంగతి విధితమే. చెరువు వద్ద పెద్ద ఎత్తున చేపల కోసం వచ్చిన వారు సంజీవ రావు తో ఘర్షణ పడటం కాటా వేయడానికి వీలు లేదని, కాటా మీద గ్రామస్తులు కూర్చున్న సంగతి విదితమే.
రెండవ రోజు గురువారం కూడా చెరువు వద్దకు జనం రాకముందే తెల్లవారుజామునే చెరువు వద్దకు వచ్చి చేపలు పట్టేందుకు మరలా క్రిమిసంహారక మందు చల్లినట్టు గ్రామస్తులు తెలిపారు. క్రిమిసంహారక మందు ఖాళీ డబ్బాలు చెరువు వద్ద లభించినట్లు గ్రామస్తులు తెలిపారు. రెండవ రోజు కూడా క్రిమిసంహారక మందు చల్లటంపై సంజీవరావును నిలదీయడంతో ఈరోజు క్రిమిసంహారక మందు చల్ల లేదని బుధవారమే చల్లిన డబ్బాలు అని తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సంజీవ రావు గతంలోనూ చేపల చెరువుల వద్ద ఈ విధంగానే వ్యవహరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కరోనా నిబంధనలు పాటించకుండా జనాలను గుంపులు గుంపులుగా చెరువు వద్దకు వస్తున్నారని దీని వలన ఎవరికి కరోనా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉందని అయినా సంజీవరావు వ్యాపారమే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అధికారులు కూడా తెలిసి అతనిపై చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
చేపలు పట్టవద్దు : మత్స్య శాఖ ఏడి షకీలా భాను
ప్రజల ప్రాణాలతో చెలగాటం అనే శీర్షికన గురువారం నవతెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా మత్స్య శాఖ ఏడి షకీలా భాను స్పందించారు. క్రిమిసంహారక మందులు చల్లి చేపల పట్ట వద్దని చేపల చెరువు వ్యాపారి సంజీవ రావుని ఆదేశించినట్లు మత్స్య శాఖ ఏడి షకీలా భాను నవతెలంగాణకు తెలిపారు. రావినూతల చేపల చెరువులో క్రిమిసంహారక మందులు చల్లి చేపలు పడుతున్న విషయం తనకు తెలిసిందని ఈ విషయంపై అతనితో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. మందులు చల్లి చేపలు పట్టడం చట్టా రీత్యా నేరమని, చేపలు పట్టడం నిలిపి వేయాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ చేపలు తిన్నవారు అనారోగ్యానికి గురి అవుతారని తెలిపారు.
చేపల వ్యాపారి సంజీవరావుపై చర్య తీసుకోవాలి: టిడిపి
రావినూతల గ్రామంలో సంజీవరావు అనే వ్యక్తి ధనార్జనే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి చేపల వ్యాపారం చేస్తున్నాడని టిడిపి మండల అధ్యక్షుడు రావట్ల సత్యనారాయణ విమర్శించారు. క్రిమిసంహారక మందులు నీటిలో కలిపి చేపలు పడుతున్న వ్యాపారిపై చర్య తీసుకోవాలని అధికారులను కోరారు.
మృత్యువాత పడిన చేపలు
క్రిమి సంహారక మందులు వాడటం వలన చేపలు మత్యువాత పడ్డాయి గురువారం సాయంత్రం కల్లా పెద్ద ఎత్తున చనిపోయిన చేపలు చెరువు ఒడ్డుకి కొట్టుకు వచ్చాయి అనేక చనిపోయిన చేపలు చెరువులో తేలాడుతూ ఉన్నాయి చేపల చేపల వ్యాపారి సంజీవ రావు క్రిమి సంహారక మందు చల్లడం వల్లే ఈ చేపలు చనిపోయాయి సుమారు మూడు క్వింటాళ్ల వరకు చేపల చనిపోయి ఉంటాయని రావినూతల గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా చేపల చెరువు వ్యాపారి సంజీవ రావు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రావినూతల గ్రామస్తులు కోరుతున్నారు.