Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయం గుప్పిట్లో ప్రజలు కరోనా వ్యాక్సిన్ , టెస్ట్ కిట్ల కొరత
నవతెలంగాణ-బోనకల్
మండలంలో కరోనా విశ్వరూపం దాల్చింది. మండలంలో 22 గ్రామాలు ఉండగా ఈ 22 గ్రామాల్లోనూ 50 కి పైగానే కరోనా కేసులు నమోదయినట్లు తెలుస్తుంది. బోనకల్ మండల కేంద్రంలో కరోనా తన విశ్వరూపంతో ప్రజలను అతలాకుతలం చేస్తుంది. మండల కేంద్రంలో కరోనా వ్యాధితో ఓ మెడికల్ షాపు యజమాని కూడా మృతి చెందాడు. మండల కేంద్రంలోని స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో కరోనా తన విశ్వరూపం చూపిస్తుంది. దాదాపు సగం మంది షాపు యజమానులకు చిరు వ్యాపారులకు కరోనా సోకినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మండల కేంద్రంలో గల షాపు నిర్వాహకులకు కరోనా టెస్టులు నిర్వహించిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో మెడికల్ షాపు యజమాని కరోనాతో మృతిచెందడంతో బోనకల్ సర్పంచ్ భూక్య సైదా నాయక్ బోనకల్ పంచాయతీ కార్యదర్శి దామల కిరణ్ పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. గురువారం దాదాపు 80 శాతం షాపులు మూసివేశారు. ఆ ప్రాంతమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లి రక్షణ చర్యలు చేపట్టారు. స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ నిర్మానుష్యంగా మారింది. మండలంలో రోజు రోజుకి కరోనా కేసులు వాయువేగంతో పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలలో భయాందోళనలు నాలుగైదు రోజుల నుంచి వేగంగా పెరిగాయి. సుమారు వారం రోజుల క్రితం వరకు కరోనా గురించి అధికారులు ప్రజా ప్రతినిధులు మాస్కు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి అంటూ ఎంత విస్తృతంగా ప్రచారం నిర్వహించిన పట్టించుకోని ప్రజలు గత నాలుగైదు రోజుల నుంచి ఆ నిబంధనలు పాటిస్తున్నారు. మండలంలో ప్రధానంగా ముష్టికుంట్ల, చిరునోముల, చిన్న బీరవల్లి, బోనకల్, ఆళ్లపాడు తదితర గ్రామాలలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో పరిస్థితులు ఇలా ఉండగా ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు కూడా ఉన్నాయి. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పూర్తిస్థాయిలో కరోనా టెస్టుల కిట్లు వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. దీంతో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టెస్ట్ కోసం వ్యాక్సింగ్ కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాక్సిన్ కిట్లు పంపిణీ చేయాలని ప్రజలుకోరుతున్నారు.