Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ గెలలకు గోద్రెజ్ ధర హెచ్చింపు
- తరలింపును నిలువరిస్తున్న ఆయిల్ ఫెడ్
నవతెలంగాణ-అశ్వారావుపేట
పామ్ ఆయిల్ గెలలు కొనుగోలులో తెలంగాణ ఆయిల్ ఫెడ్‌కు ఆంధ్రా ప్రైవేట్ గోద్రేజ్‌కు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీనికి కారణం గోద్రెజ్ ధరల కంటే ఆయిల్ ఫెడ్ ధర కొంచెం అల్పంగా ఉండటం, దీనిని భూషిగా చూపించి దీనికి అదనంగా చెల్లించడంలో అత్యాశకు వెళ్ళే కొందరు తెలంగాణ రైతులు గెలలను ఆంధ్రా తరిలిస్తున్నారు. దీంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు నష్టనివారణా చర్యలు చేపట్టి రాత్రీ పగలూ గస్తీ కాస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ నెల పామ్ ఆయిల్ టన్ను గెలలు ధర తెలంగాణ ఆయిల్ ఫెడ్ రూ.17 354 చెల్లించగా, ఆంధ్రా గోద్రేజ్ రూ.18000లు చెల్లించేది. ఆయిల్‌ఫెడ్ ధర కంటే కొంచెం అధికంగా గోద్రేజ్ చెల్లిస్తుండటంతో ఇక్కడ రైతులు ఆంధ్రాకు నేరుగా తరలిస్తున్నారు. ఇది గమనించిన ఆయిల్ ఫెడ్ నష్టనివారణా చర్యలు చేపట్టి అక్రమ తరలింపును నిలువరిస్తుంది. ఈ విషయంపై అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ డివిజనల్, ఫ్యాక్టరీ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణ మాట్లాడుతూ.... ప్రభుత్వ రంగ సంస్థలను బలహీన పర్చడం కోసమే ప్రైవేట్ సంస్థలు పనిగట్టుకుని కూర్చున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గ్రహించాలని అన్నారు.