Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిశ ప్రొటెక్షన్ వేల్ఫేర్ పౌండేషన్ నిర్వహకులు
నవతెలంగాణ-అశ్వాపురం
నవమాసాలు మోసి కనీపెంచి పెద్దచేసిన కుమారులు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆలన పాలన చూడటంలో తీవ్రమైన నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నారు. గత కొన్నేండ్లుగా వృద్ధులిద్దరు తనయుల అండదండలు లేకుండానే జీవనం సాగిస్తున్నారు. కూర్చుంటే లేవలేని స్థితిలో ఉన్న వీరి ఇబ్బందులను, బాధలను తెలుసుకున్న దిశ ప్రొటేక్షన్ వేల్పేర్ పౌండేషన్ నిర్వహకులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. శనివారం ఆ గ్రామానికి చేరుకుని వృద్ధుల సమస్య పరిష్కారం అయ్యేవరకూ వారికి అండగా ఉంటూ పోరాడుతామని చేయూతనిచ్చారు. మండల పరిధిలోని ఆనందాపురం గ్రామానికి చెందిన నేలపట్ల తిరుపతిరెడ్డి, సరోజనమ్మలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. ఓ కుమారుడు భద్రాచలం మరో కుమారుడు గోపాలపురంలో నివాసముంటున్నారు. తల్లి దండ్రులను మాత్రం స్వగ్రామైన ఆనందాపురంలోనే ఉంచారుగాని వారి ఆలనా పాలన పట్టించుకోవడం వదిలేసారు. దీంతో వృద్ధులకు ఉన్న ఓ నాలుగు ఎకరాల భూమిని కవులుకు ఇచ్చుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడప్పుడు కుమార్తె సహాయ సహకారాలతో జీవనాన్ని సాగిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని పిల్లలు తమను చూడాలని ఎన్నోసార్లు స్థానిక పెద్దలకు వివరించారు. రాజకీయనాయకులకు తెలియజేసి సమస్య వివరించారు. చివరకు పోలీసు స్టేషన్కు కూడా వారిని పిలిపించి మందలించిన వారిలో మాత్రం తల్లిదండ్రులను సరిగా చూసుకో వాలన్న జ్ఞానం ఇసుమంతైన రాకపోవడంతో వృద్ధ్దులిద్దరూ పిల్లలుండి కూడా అనాదల్లాగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలిగిన అదే గ్రామానికి చెందిన మందా రాంబాబు అనే దళిత యువకుడు మంచిచెడులు చూస్తు, వారిని ఆసుపత్రికి తీసుకెల్లడం, నిత్యవసరాలు తీసుకురావ డం చేస్తూ కొడుకులాగా చూస్తున్నాడని వృద్ధులు కన్నీటి పర్యాంతమైయ్యారు.
వృద్దుల కుమారులపై దిశ కమిటీ సభ్యులు అశ్వాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు. వృద్ధులను కలసినవారిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సూదిరెడ్డి గోపాలకృ ష్ణారెడ్డి, దిశ ప్రొటేక్షన్ నియోజకవర్గ అధ్యక్షులు ఇటికాల మాధవి, భద్రాచం మణుగూరు అధ్యక్షులు ఎస్కె. ఆరీఫా, నాగుల కుసుమ, పూజల లక్ష్మి, మద్దెల అన్నపూర్ణ, పూజారి జ్యోతి, దుర్గా,