Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో సీపీఐ(ఎం) కూలిమి విజయాన్ని కాంక్షిస్తూ ర్యాలీ
నవతెలంగాణ-సుజాతనగర్
పేదలకు అండ ఎర్రజెండానేనని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వీర్ల రమేష్ అన్నారు. ఆదివారం కేరళలో సీపీఐ(ఎం) కూటమి విజయాన్ని కాంక్షిస్తూ మండల పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ విజయం వామపక్షాలకే కాదని ప్రతి పేదవాడికి ఒక గొప్ప వరం అని ఆయన అన్నారు. విద్య వైద్యం అందించడంలో కేరళ ప్రభుత్వం ముందు వరుసలో నిలబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్ర శివరామకృష్ణ, కాట్రాల తిరుపతిరావు, బచ్చలి కూర శ్రీను, గండమాల భాస్కర్, కొండే కృష్ణ చల్ల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.