Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు :
కరోనా మహమ్మారి భారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకి అండగా వుంటామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఆదివారం రేగా విష్ణు మెమోరిబుల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 1500 మందిపైగా బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయాలు అందిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుండి నియోజకవర్గంలోని ఏడు మండలాల అధ్యక్షుల నేతృత్వంలో కరోనా బాధితులకు ఈ సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా సోకిన వ్యక్తి నిత్యావసర సరుకుల కోసం మార్కెట్కు రావడం వలన వారి నుండి ఇంకోకరికి వైరస్ సోకుతుందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కరోనా బాధితుల కుటుంబాలు ధైర్యంగా వుండాలని, ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్లు ధరించి, శానిటైజర్స్ చేసుకోవాలన్నారు.