Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి :
యాసంగి వరి సాగు చేసిన రైతులు ధాన్యం కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్ ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలో వరి ధాన్యం ఆరబోసిన రైతులను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులు ధాన్యాన్ని తక్షణమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 రోజుల నుండి వరి కల్లాలో మార్కెట్ యాడ్ ల నందు ధాన్యం ఆరబెట్టినా కోనుగోలు చేసే నాథుడే లేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే అలుసుగా చేసుకొని అధికారులు మిల్లర్లు కుమ్మకై రైతుల నుండి తాలు పేరుతో 10నుండి 20 కేజీల వరకు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సకాలంలో రైతుల దగ్గర నుండి ధాన్యం కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతే రాజును చేస్తానని నమ్మబలికి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే మిల్లర్లు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతులు ఆత్మహత్యలకు చరణ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల మధు, శ్రీను, భాస్కర్, వూకంటి చిట్టిబాబు, వినోద్, సత్యం, శనగాని చంద్రశేఖర్, రాధ, లక్ష్మీ పాల్గొన్నారు.