Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బూర్గంపాడు: పాల్వంచ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢకొీన్న సంఘటన బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర పీహెచ్సీ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఏటపాక పోలీస్టేషన్లో ఆర్ఎస్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ జిలానీపాషా(34), కానిస్టేబుల్ పూనెం సురేష్(28)లు ద్విచక్రవాహనంపై విధులు ముగించుకుని పని నిమిత్తం పాల్వంచ వైపు వెళ్తున్నారు. మండల పరిధిలోని మోరంపల్లిబంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోకి రాగానే ఎదురుగా పాల్వంచ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ(ఏపీ05టీసీ2938) స్పీడ్ బ్రేకర్స్ వద్ద అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢకొీట్టింది. ఈ సంఘటనలో ఆర్ఎస్ఐ జిలానీపాషా అక్కడికక్కడే మృతిచెందగా, కానిస్టేబుల్ పూనెం సురేష్ కు తీవ్రగాయాలయ్యాయి. అక్కడితో లారీ ఆగకుండా పక్కనే పార్కింగ్ చేసి ఉన్న కారు, మరో ద్విచక్రవాహనాన్ని ఢకొీట్టింది. ఆ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు అతన్ని స్థానిక పీహెచ్సీలో ప్రాథమిక చిక్సిత అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సంఘటన స్థలానికి బూర్గంపాడు ఎస్సై జితేందర్ సిబ్బందితో హుటాహుటీన చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. మృతుల కుటుంబా లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ జితేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.