Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాస్కులు, శానిటైజర్ లు వాడి సామాజిక
- దూరం పాటించండి కరోనా నియంత్రించండి
- వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా వైరస్ను అరికట్టాలంటే మనోధైర్యంతో ప్రతి ఒక్కరూ ఉండాలని, వ్యాధి సోకిందని మనోధైర్యాన్ని కొల్పోవద్దని, మంచి పౌష్టికాహారం, వైద్యులు సూచించిన మందులు, పరిశుభ్రతతో ఉంటే కరోనాను అరికట్ట వచ్చని కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం 10 వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ అన్నారు. ఆదివారం పలువురు మహిళలకు రెండో దశ కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పేద, మధ్యతరగతి ప్రజానీకం కోసం ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి, పేద ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణలో ప్రతి వ్యక్తి మాస్కు ధరించాలని, శానిటైజర్ వాడి, సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా నియంత్రణకు పాటుపడాలని ఆమె పిలుపు నిచ్చారు. మున్సిపల్ అధికారులు వారానికొకసారి అన్ని వార్డుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అధికారులను కోరారు. మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు హైపోక్లోరైడ్ ద్రావణ పిచికారి ఒక్కటే వాహనం ఉండటం వల్ల పూర్తిస్థాయిలో స్ప్రే జరగడం లేదని, తక్షణమే మున్సిపాలిటీకి మరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని, అన్ని వార్డుల్లో వెంటనే ద్రావణాన్ని స్ప్రే చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిఓ సరిత, బిందు, ఆర్పిలు కవిత, బానోతు జానకి, షబానా, అంగన్వాడి టీచర్ సరోజ, ఆయా వెంకటలక్ష్మి, వార్డ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.