Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరాటౌన్
కేరళలో 40 సంవత్సరాల సంప్రదాయ రాజకీయ తీర్పును తిరగరాసి పినరరు విజయన్ నాయకత్వంలోని సిపిఐ(ఎం) కూటమి రెండవసారి అధికారంలోకి రావడం తోపాటు కేంద్రలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఒక సీటు కూడా గెలవకుండా తీర్పు ఇచ్చి కేరళ ప్రజలు రాజకీయ చైతన్యం చాటారని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. కేరళలో సిపిఐ(ఎం) నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ రెండవసారి అధికారం లోకి రావడంతో వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వర రావు భవనం వద్ద విజయోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, చెరుకుమల్లి కుటుంబరావు, నూకల వెంకటేశ్వరరావు, యనమద్ధి రామకృష్ణ, వర్మ, తోట పద్మావతి తదితరులు పాల్గొన్నారు
సత్తుపల్లిరూరల్ : కేరళ రాష్ట్రంలో 40 సంవత్సరాల చరిత్ర ను సీపీఎం తిరగరాసిందని సత్తుపల్లి సీపీఎం మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంగారం సెంటర్ నందు పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరిపారు. ఈకార్యక్రమంలో కావూరి వెంకటేశ్వరావు, కువ్వారపు లక్ష్మణ్ రావు, కాకాని శ్రీనివాసరావు, మద్దిశెట్టి పోషయ్య, వినోద్, నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు.