Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా బతుకులు ఏం కావాలే...
- ప్రాణాలు అయినా ఇస్తం భూములు మాత్రం ప్రభుత్వ రేటుకు ఇవ్వం
- కోవిడ్ 19 రెండవ దశ రైతులను చంపడానికా గ్రామ సభలు
- సీతమ్మ సాగర్ పీసా గ్రామ సభల్లో- నిర్వాసిత రైతులు డిమాండ్
మూడు పంటలు పండే భూములను గుచ్చుకుంటుండ్రు మా బతుకులు ఏమీ కావాలీ, సారూ అంటూ సీతమ్మ సాగర్ భూ నిర్వాసిత రైతులు భూ సేకరణ అధికారి అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లును నిలదీశారు. ప్రాణాలు అయినా ఇస్తం కాని విలువైన భూములను ప్రభుత్వం రేటుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోము అంటూ పీసా గ్రామ సభల్లో రైతులు తమ వాదనలు విన్పించారు. కోవిడ్ రెండవ దశ కరోనా కేసులు పెరుగుతుంటే ఓ ఉన్నతాధికారి సమక్షంలో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలి పీసా గ్రామ సభలు ఏంటని నిర్వాసిత రైతులు నిలదీశారు.
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మూడు పంటలు పండే భూములను గుచ్చుకుంటుండ్రు మా బతుకులు ఏమీ కావాలీ, సారూ అంటూ సీతమ్మ సాగర్ భూ నిర్వాసిత రైతులు భూ సేకరణ అధికారి అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లును నిలదీశారు. ప్రాణాలు అయినా ఇస్తం కాని విలువైన భూములను ప్రభుత్వం రేటుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోము అంటూ పీసా గ్రామ సభల్లో రైతులు తమ వాదనలు విన్పించారు. కోవిడ్ రెండవ దశ కరోనా కేసులు పెరుగుతుంటే ఓ ఉన్నతాధికారి సమక్షంలో కోవిడ్ నిబంధనలు గాలికి వదిలి పీసా గ్రామ సభలు ఏంటని నిర్వాసిత రైతులు నిలదీశారు.
దుమ్ముగూడెం గోదావరి నదిపై నిర్మించే సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణ గోదావరి, వాగుల వెంట కరకట్టల నిర్మాణం కోసం భూ సేకరణ నిర్వహించి గెజిట్ విడుదల చేయడంతో మొదటి దఫా గ్రామ సభలు నిర్వహించారు. రెండవ సారి ఆధివారం ప్రగళ్లపల్లి, కాశీనగరం, పర్ణశాల, చిన్నబండిరేవు గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో సీతమ్మ సాగర్ భూసేకరణ అధికారి అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పీసా గ్రామ సభలు నిర్వహించారు. ముందుగా ఆయన మాట్లాడారు. సీతమ్మ సాగర్ కరకట్ట నిర్మాణంతో నిర్వాసితులు అవుతున్న రైతులకు ప్రభుత్వం రిజిష్టార్ లెక్కల ప్రకారం ఎకరాకు రూ 3 లక్షల 20 వేల రూపాయలు అందజేస్తామన్నారు. పరిహారం విషయంలో గ్రామ సభల్లో రైతులు ఇచ్చిన సూచనలు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందన్నారు. భూ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా చోట్ల జరిగిన గ్రామ సభల్లో రైతులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఆమోదయోగ్యంగా లేదని మూడు పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని తెలపంతో పాటు ఎకరాకు 50 లక్షల రూపాయలు లేదా, భూమికి భూమి ఇవ్వాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని గ్రామ సభలో తీర్మాణం చేశారు. అధికారులు భూముల సర్వే దగ్గర నుండి రైతులను సంప్రదించకుండానే ఏక పక్షంగా చేశారని రైతులు లేవనెత్తారు. అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం కోసం భీముని గుండం నిర్వాసిత రైతులకు 2018లో రూ.12 లక్షలు అందజేశారని రైతులు భూ సేకరణ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇస్తామంటున్న రేటుకు భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని రైతులు తెలిపారు. కోవిడ్ 19 రెండవ దశ అధికంగా ఉందని ప్రతి గ్రామంలో కరోనా కేసులు ఉన్నప్పటికి ఓ ఉన్నతాధికారే గ్రామ సభలు నిర్వహించడం ఏంటని పీసా గ్రామ సభలు వాయిదా వేసి మరలా నిర్వహించాలని పీసా గ్రామ సభల్లో నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. కాగా పర్ణశాలలో పీసా కమిటీ తీర్మాణంపై ఆమోదం తెలపలేదు. అధికారులు మాత్రం ఇది చివరి గ్రామ సభ అని తెలుపుతున్నారు. గ్రామ సభల్లో తహశీల్దార్ వర్సా రవికుమార్, డిఏఓ రాజన్నకుమార్, విపిసి రమణారావు, ఆర్ఐ ఆదినారాయణతో పాటు సర్పంచ్లు జుంజురి లకీë, కనకదుర్గ, తెల్లం వరలకీë, ఉపసర్పంచ్లు వాగె ఖాదర్ బాబా, బైరబోయిన ఉమేష్లతో పాటు ఆయా గ్రామ పంచాయితీలకు చెందిన పంచాయితీ కార్యదర్శులు, విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.