Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అ శుక్రవారం వారాంతపు సంతను నిలిపి
వేసిన అధికారులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలో కోవిడ్-19 రెండవ దశ కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో మండల ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ప్రకటించుకుంటున్నారు. మొదట మారుమూల గిరిజన గ్రామమైన సింగవరంలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదు కావడంతో అక్కడి ప్రజలు స్వచ్చంద లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకున్న మండల కేంద్రంగా ఉన్న లకీëనగరం గ్రామంలో వ్యాపారా లాలా దేవీలు సాగిస్తున్న కిరాణా దుకాణ సముదయాలతో పాటు వివిద వ్యాపార వర్గాల యజమానులు సైతం తాము కూడా స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు తెలపడంతో పాటు ఉదయం 7.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వ్యాపార లావా దేవీలు సాగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణలతో పాటు వివిద వ్యాపారాలు సాగించే వారు సైతం స్వచ్చంద లాక్ డౌన్లో పాల్గొన్నారు.
వారాంతపు సంతను నిలిపి వేసిన అధికారులు
మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారాంతపు సంతను నిలిపివేశారు. ఈ సంతకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులతో పాటు చత్తీస్‌ఘడ్‌కు చెందిన గిరిజనులు వస్తుంటారు. కరోనా కట్టడిలో భాగంగా వారాంతపు సంతను తాత్కాలికి నిలిపి వేసినట్టు ఎంపీడీఓ ముత్యాలరావు తెలిపారు. రెండవ దశ కరోనా అదుపులోకి వచ్చే వరకు వారాంతపు సంతను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.