Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి రోజు రోజుకు అధికమవుతున్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, నిబంధనలు పాటించాలని భద్రాచలం ఏఎస్పీ డా.వినీత్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ముమ్మరంగా సాగుతున్న
ఇంటింటి సర్వే
నవతెలంగాణ-భద్రాచలం
పట్టణంలోని పలు కాలనీల్లో శుక్రవారం ఇంటింటి సర్వే నిర్వహించినట్టు తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వైద్య సిబ్బందితో కలిసి ఆయన పలు కాలనీల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. కరోనాపై పలువురికి అవగాహన కల్పించారు.
కరోనా మొదటి
డోస్ నిలిపివేత
నవతెలంగాణ-తల్లాడ
శనివారం నుండి కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ ఈ నెల 15 వరకు నిలిపివేస్తున్నట్టు డాక్టర్ నవ్య కాంత్ తెలిపారు. ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శుక్రవారం 120 మందికి వ్యాక్సినేషన్ చేశామన్నారు. నలభై ఎనిమిది మందిని పరీక్షించగా 12 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు.